Categories

71లక్షల నుడా నిధులతో పార్క్.. చైర్మన్ ద్వారక శంకుస్థాపన!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ – నెల్లూరు నగర కార్పొరేషన్ లోని 30వ డివిజన్లో పార్క్ అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ శంకుస్థాపన చేశారు. అత్యంత వేగంగా ఈ పనులు పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 30వ డివిజన్ డైకస్ రోడ్డు ప్రాంతంలో నుడా నిధులతో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ వైసీపీ కార్యాలయ ఇన్ చార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఇతర అధికారులు హాజరయ్యారు. 71లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *