Categories

చెన్నై అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స విజయవంతం!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –
చెన్నైలోని అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో మొదడులో రక్తనాళాల వైఫల్యంతో పుట్టిన 48 గంటల వయస్సు గల శిశువుకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి బిడ్డకు ప్రాణం పోశారు వైద్యులు. ఒక మిలియన్ జననాలలో ఒకరిలో మాత్రమే ఇలాంటి జబ్బు కనిపిస్తుంటుంది. బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే వైద్యులు జబ్బును కనుగొన్నారు. బిడ్డలో జబ్బును తెలుసుకున్న వైద్యులు ప్రసవానికి ముందు వివిధ పరీక్షలను నిర్వహించి బిడ్డకు ఎండో వాస్కులర్ ఎంబోలైజేషన్ అనే శస్త్ర చికిత్స నిర్వహించాలని సర్వం సిద్దం చేశారు. ప్రసవం తర్వాత శిశువుకు గుండె సంభందిత సమస్యతో పాటూ మెదడు రక్తనాళాల్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించారు. దాన్ని వైద్య బాషలో వీన్ ఆఫ్ గాలెన్ గా పిలుస్తారు. కుటుంబసభ్యుల సమ్మతితో పుట్టిన 48 గంటల తర్వాత అపోలో చిల్జ్రన్స్ హాస్పిటల్ న్యూరో – ఎండో వాస్కులర్ సర్జరీస్ హెడ్ డాక్టర్ శ్రీనివాసన్ పరమశివం నేతృత్వంలోని వైద్య బృందం శిశువు మెదడుకు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించింది.

శస్త్ర చికిత్స విజయవంతం అయిన దానిపై న్యూరో – ఎండో వాస్కులర్ సర్జరీస్ హెడ్ డాక్టర్ శ్రీనివాసన్ పరమశివం చెన్నైలోని అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. వీన్ ఆఫ్ గాలెన్ వైఫల్యం అనేది మొదడులోని రక్తనాళాలు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యి తద్వారా గుండె మరియు ఊపిరి తిత్తులకు సాధారణం కంటే అధికమైన ఒత్తిడితో రక్త ప్రసరణకు దారితీస్తుందన్నారు. దీని వద్ద అప్పుడప్పుడు శిశువు గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసిన శిశువు విషయంలో తాము తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈ సమస్యను గుర్తించామని, పుట్టిన 48 గంటల్లోనే శస్త్ర చికిత్స నిర్వహించి బిడ్డ ప్రాణాలను కాపాడగలిగామని డాక్టర్ శ్రీనివాసన్ పరమశివం వెల్లడించారు. అత్యాధునికి విధానంలో నిర్వహించిన ఈ శస్త్ర చికిత్స ద్వారా తాము ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నామని… శస్త్ర చికిత్స విజయవంతం అవుతుందని నిర్ధారించుకున్నా తర్వాతే ఆపరేషన్ చేశామని స్పష్టం చేశారు. మెదడులోని రక్తనాళాలకు పుర్రెను తెరవకుండానే ఈ శస్త్ర చికిత్స నిర్వహించామని, ప్రభావిత అవయవాలకు సాధారణంగానే రక్త సరఫరా అయ్యేలా చికిత్స నిర్వహించామన్నారు. శిశువు బొడ్డు ద్వారా సన్నని, పొడవైన ట్యూబ్ ను మెదడులోని ప్రభావిత రక్త నాళంలోకి పంపించి “సూపర్ గ్లూ” అనే దాన్ని ఇంజెక్ట్ చేసినట్లు తెలిపారు. డాక్టర్ శ్రీనివాసన్ పరమశివ దీనిపై ఇంకా వివరిస్తూ శిశువు బొడ్డు ద్వారా ట్యూబ్ ను ఉపయోగించి ఈ శస్త్ర చికిత్స చేయడం, కార్డియాక్ ఫేసింగ్ ను ఉపయోగించడం ద్వారా ఈ శస్త్ర చికిత్స విజయవంతం అయిందని చెప్పారు. ఆపరేషన్ తర్వాత ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకున్నట్లు తెలియజేశారు.

మరో వైపు శిశువుకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్య బృందాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతా రెడ్డి అభినందించారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పిల్లల్లో సంభవించే క్లిష్టమైన, అరుదైన వ్యాధులకు చికిత్సను విజయవంతంగా నిర్వహించడంలో అపోలో హాస్పిటల్స్ ముందంజలో ఉందని చెప్పారు. అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో సమర్ధవంతమైన వైద్య బృందం ఉందని, అధునాతన చికిత్సా పద్దతులను తమ వైద్య బృందం ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తుందన్నారు. శస్త్ర చికిత్స నిర్వహించిన శిశువు విషయంలో ఆలస్యం జరగకుండా 48 గంటల్లోనే విజయవంతంగా చికిత్స నిర్వహించి బిడ్డ ప్రాణాలకు వైద్యులు భరోసా ఇచ్చారని… పిల్లల ప్రాణాలు కాపాడే విషయంలో కొత్త కొత్త నూతన వైద్య విధానాలను అవలంభించడం వైద్యుల నిబద్ధతకు నిదర్శమని సునీతా రెడ్డి చెప్పారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *