Categories

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఒకవైపు ఉపరితల ద్రోణి మరోవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఇఫ్పటికే ఏపీలోకి ప్రవేశించినట్లు ఐఎండీ ప్రకటించింది. మాన్‌సూన్ ప్రభావంతోనే రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. నైరుతి గాలుల కారణంగా ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతోపాటు రాయలసీమలో పలుచోట్ల వానలు పడుతున్నాయి. కడప జిల్లాలో జమ్మలమడుగు, రాజంపేట, మైలవరం, వేంపల్లె, పెద్దముడియం, ఎర్రగుంట్ల, బ్రహ్మంగారిమఠం, వీరపునాయునిపల్లె, చక్రాయపేట మండలాల్లో వర్షం దంచికొట్టింది. దాంతో, పాపాగ్ని నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ఇక, తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నారు. కోనసీమలో గాలివానకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *