రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –డిఅతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం ముంబై జాతీయ రహదారి గంగవరం కాలువ వద్ద మారుతి సుజుకి డిజైర్ వాహనం నెల్లూరు వైపు నుంచి అతి వేగంగా వస్తూ పోతిరెడ్డిపాలెం కు చెందిన పఠాన్ రహ్మత్ మోటార్ సైకిల్ ను ఢీ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటికీ కారు అదుపు కాకపోవడంతో మరో మోటర్ సైకిల్ ను ఢీ కొట్టడంతో మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనం నడిపిన వ్యక్తి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసి, వాహనంలో వెనుక ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోవూరు ఎస్ ఐ కృష్ణారెడ్డి తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *