ఏపీలో రూ.100 దాటిన పెట్రోల్ ధర..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –పెట్రోలు రోజుకు పెరిగేది 15 పైసలే.. అయితే ఏడాది తిరిగే సరికి లీటర్ కు రూ. 25 వరకు పెరిగింది. డీజిల్ అయితే మరో అడుగు ముందు వేస్తూ మరింత మంట పెడుతోంది. రోజు రోజుకు భారంగా మారుతున్న పెట్రో ధరలతో రవాణా రంగం కుంటి నడక నడుస్తోంది. ఎక్కడో ఉన్న పెట్రో ధరలు ఇప్పుడు కొండెక్కి కూర్చున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కోవిడ్‌తో వణికి పోతున్న జనంకు పెట్రో ధరలు మరింత వణుకు పట్టుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 100.11కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 95.34 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 99.42ఉండగా.. డీజిల్ ధర రూ.93.73గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.72లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.94.95 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.82 గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.09గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 101.11లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.95.34 లకు లభిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *