యజ్ఞం లా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం- ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –యజ్ఞం లా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
ముత్తుకూరు మండలం లో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు” కార్యక్రమంలో భాగంగా నారికేళ్లపల్లి పంచాయతీ లోని సుబ్బా రెడ్డిపాళెంలోని “వై. యస్. ఆర్. జగనన్న కాలనీ”లో నిర్మించ తలపెట్టిన ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు కరెంటు మీటర్లను అందజేసినారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన 7, 422 ఇళ్లల్లో 2, 617 ఇళ్లు ముత్తుకూరు మండలంలో మంజూరు చేశామన్నారు. నారికేళ్లపల్లి గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్లు, సిమెంట్ డ్రైన్లు, ఇళ్ల స్థలాల లేఔట్ల అభివృద్ధి లాంటి వసతి సదుపాయాల కోసం 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు.
ఇళ్లు నిర్మించుకునే ప్రతి లబ్దిదారునికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా అందజేయడంతో పాటు, 90 బస్తాలు సిమెంటు, బస్తా రూ. 235/-ల చొప్పున మరియు స్టీలు టన్ను 58 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నుండి అందజేస్తామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జూన్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, మంజూరైన 7422 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వై. యస్. ఆర్. జగనన్న కాలనీ లలో లేఔట్లను చదును చేయడం, అంతర్గత రోడ్లు, నీటి సరఫరా, కరెంటు సదుపాయం కల్పించడానికి 60 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి, పనులు చేపడుతున్నమన్నారు. ముత్తుకూరు మండలంలో వై. యస్. ఆర్ జగనన్న కాలనీ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం, 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించమన్నారు. కాలనీలలో ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు, సొంత స్థలాల్లో ఇళ్లు కావాలని కోరుకునే వారికి కూడా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, జగనన్న ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాడి ఇంటి నిర్మాణంలో కూడా రాజకీయాలు చేస్తే, వై. యస్. ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు అందించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెల్పినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *