మచ్చలేని వ్యక్తి మాజీ సీఎస్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –మచ్ఛలేని మంచి వ్యక్తి ఉమ్మడి రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్ వీ. ప్రసాద్ అని కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ పూల చంద్రశేఖర్ అన్నారు. బుధవారం గూడూరు పట్టణంలోని లయోలా కళాశాలలో.
మాజీ సీఎస్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీ ప్రసాద్ మంగళవారం హైదరాబాద్ లో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరమన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రభుత్వ శాఖలలో పనిచేసి ఆ శాఖలకు వన్నె తెచ్చిన గొప్ప అధికారి అన్నారు. చనిపోయేంత వరకూ ఆయనకు సొంత ఇళ్లు లేకపోవడం ఆయన నిజాయితీ, నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఆయన మన జిల్లా వాసి కావడం, గూడూరులోనూ సబ్ కలెక్టర్ గా పనిచేయడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు. అనంతరం ఎస్ వీ. ప్రసాద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ పంటా శ్రీనివాసులు రెడ్డి, చిల్లకూరు, కోట మండలాల అధ్యక్షులు వేమయ్య, గయాజుద్దీన్ నేహామ్య, రాము పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *