కరోనా నిబంధనలు పాటించాలి – కర్తం ప్రతాప్ రెడ్డి!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –వ్యాపారులు అందరూ కరోనా నిబంధనలు పాటించాలని 14వ డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్తం ప్రతాప్ రెడ్డి సూచించారు. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలపై ఆయన డివిజన్ పరిధిలోని ఏసీ నగర్ లో పర్యటించి వ్యాపారులకు పలు సూచనలు చేశారు. వ్యాపారస్తులు అందరూ కరోనా కట్టడి కి ప్రభుత్వం, అధికారులు తీసుకొంటున్న చర్యలకు సహకరించాలన్నారు. షాపులకు వచ్చే వినియోగదారులు భౌతిక దూరం పాటించేలా చూడాలని, మాస్క్ ధరించి రావాలసిందిగా చెప్పాలని, శానిటైజర్ లు అంగళ్లలో అందుబాటులో ఉంచాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మీవంతు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *