అభివృద్ధిలో వెంకటగిరి మున్సిపాలిటీ అగ్రగామిని చేద్దాం- – ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ప్రణాళికాబద్ధంగా వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని  ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నూతన సభ్యులకు దిశానిర్దేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి మునిసిపాలిటీ అంతటా.. 25 వార్డుల్లో అవసరమైన ప్రతీ ప్రాంతంలో సైడ్ కాలవలు, సిమెంట్ రోడ్లు, త్రాగునీటి పైప్ లైను, విద్యుత్ లైన్లు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా పని చేసి అభివృద్ధిలో వెంకటగిరి మున్సిపాలిటీ అగ్రగామిని చేద్దామని మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో నూతన సభ్యులకు ఆయన పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *