Categories

” పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా” చేస్తున్న సేవలు అమోఘం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –కరోనా మహమ్మారి కి ఎంతోమంది చనిపోతూ చివరి గడియల్లో వారి పార్థివ దేహాన్ని ఖననం చేసేందుకు అవసరమైన నలుగురు మనుషులు కూడా దగ్గరకు రాని పరిస్థితు లలో తమ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాలంటీర్లు ఎలాంటి బెరుకు లేకుండా కులమతాలకతీతంగా మృతదేహాలకు జరగాల్సిన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చేస్తున్నారని ” పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా “రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబ్దుల్ సుభాన్ తెలిపారు .తమ కమిటీ సభ్యులు చేస్తున్న సేవలను గుర్తించి తమ సభ్యులు కరోనా బారిన పడి మృతిచెందిన వారి మృతదేహాలను తరలించే సమయంలో వారికి కరోనా సోకకుండా ఉండేందుకు “కార్వే” గ్రూప్ మరియు” ఐ జి ఈ ఎస్ మసీద్” వైస్ ప్రెసిడెంట్ జాకీర్ భాయ్ ల సహకారంతో ఒక లక్షా 50 వేల విలువ కలిగిన 200 పి పి ఈ కిట్లను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు ” పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా” చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో లో సభ్యులు ఎస్ కె సనావుల్లా , ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *