Categories

బాల సుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలి !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –బాల సుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వి. చంద్రమౌళి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .శుక్రవారం ఎస్పీ బాలసుబ్రమణ్యం జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్బంగా బాలసుబ్రహ్మణ్య ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ బహుభాషల్లో ఎస్పీ నలభై వేల పాటలు పాడారని అన్నారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతని గుర్తింపుగా చారిత్రాత్మక కట్టడాలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు .నేటితరం గాయకులు అతనిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు . సమాజానికి ఎన్నో రకాల సేవచేసిన బాలసుబ్రమణ్యం కోట్లాది విలువచేసే తన ఇంటిని సంగీత కళాశాల ఇవ్వడం అభినందనీయమన్నారు .ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్..గట్టుపల్లి ఆదిశేషయ్య వై. విశ్వనాథం .రాళ్ళపల్లి సాయికృష్ణ .డి టి హరికృష్ణ సర్వేపల్లి కృష్ణా తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *