ఆనందయ్య ను సత్కరించిన ఏపీయూడబ్ల్యూజే నేతలు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –డిఆనందయ్య సాంప్రదాయ మందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అత్యధిక మంది జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ జిల్లా అధ్యక్షుడు వల్లూరు వెంకటేశ్వర్లు, జిల్లా నేత దయ శంకర్ తదితరులు ఆనందయ్యతో భేటీ అయ్యారు.ఆయనను శాలువతో సత్కరించారు.ఆనందయ్య సాంప్రదాయ మందుకు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఉచితంగా మందులు తయారు చేస్తూ ఆనందయ్య తనవంతుగా సామాజిక బాధ్యతతో ముందు వరుసలో ఉన్నారని ఏపీయూడబ్ల్యూజే నేతలు కొనియాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *