ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విజయ్ కాంత్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –డిఎంకె నేత ప్రముఖ నటుడు విజయ్ కాంత్ గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విజయకాంత్ ఆరోగ్య పరీక్షల కోసం మే 19న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. కాగా నెగిటివ్ నిర్ధారణ అయింది. ఇక సాధారణ ఆరోగ్య పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత విజయ్ కాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అయితే విజయకాంత్ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన ఆరోగ్యం గురించి అసత్య ప్రచారాలు చేయవద్దని పార్టీ సభ్యులు కోరుతున్నారు. 2020 సెప్టెంబర్ లో విజయ్ కాంత్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. పదిరోజుల చికిత్స తర్వాత ఆయన కరోనా నుండి కోరుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *