అంబేద్కర్ రమాబాయ్ ను ఆదర్శవంతంగా తీసుకోండి-దళిత నేత అరవ పూర్ణ ప్రకాశ్ !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సతీమణి అయిన రమాబాయ్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని,ఆమె అడుగుజాడల్లో నడుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ దళిత సేన రాష్ర్ట కార్యదర్శి అరవ పూర్ణ ప్రకాశ్ పిలుపునిచ్చారు.నగరంలోని అంబేద్కర్ భవనంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామబాయ్ సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.రమాబాయ్ అంబేద్కర్ ఈ నెల 27వ తేదీన జరుగు పలు సేవా కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ముఖ్యంగా సర్వోదయ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నందు జరుగు రమాబాయ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికేయులకు,విద్యార్థిని విద్యార్థులకు,అతిథులకు,ప్రజలకు మాస్క్,శానిటేషన్ పంపిణీ చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అరిగెల సాయిరామ్,దళిత నాయకులు డోలా శ్రీహరి,లింగాల రవికుమార్,షేక్ బాబు,పోతురాజు రవి,మధు సూదన్,శంకర్ ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *