సేవా గుణమే కోట సునీల్ కుమార్ స్వామి ఇమ్యూనిటీ.. !!

1 min read
kota suneel kumar

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయిసత్సంగ నిలయం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ స్వామి టిడ్కో కోవిడ్ కేర్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాలను ఖత కొన్ని రోజులుగా కోటా సునీల్ కుమార్ కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో గాంధీ నగర్ టిట్టుకో అపార్ట్మెంట్ వద్ద అధికారులు కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సాయి సత్సంగ నిలయం నిర్వాకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వారి నివాసం నుండే ప్రతి రోజు భోజనం ప్యాకెట్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ స్వామి మాట్లాడుతూ కరోనా వైరస్‌ పట్ల ప్రజలు ధైర్యంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకొని వైరస్‌ నివారణకు కృషి చేయాలన్నారు. ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని ఆయన సూచించారు. ఈ పంపిణీ కార్యక్రమం సహకరిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్, మనోజ్ కుమార్, పలువురు సాయిసత్సంగ నిలయం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *