రియల్ హీరో నుంచి రీల్ హీరోగా మారనున్న సోనూసూద్..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –విలన్ గా నటించాడు కానీ.. ప్రస్తుతం రియల్ హీరోగా జీవిస్తున్నాడు. అడిగిన వారికి కాదనకుండా, లేదనకుండా సాయం చేస్తున్నాడు. భారతీయుల మనస్సులో ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నాడు. కరోనా పేరు ఎంతలా మార్మోగుతుందో.. సోనూ సూద్ పేరు కూడా మనదేశంలో అంతే హైలెట్ అవుతుంది. అయితే తెరపై కూడా అతన్ని హీరోగా చూపించాలనే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో మన తెలుగు దర్శకుడే సోనూ సూద్ కోసం ఓ సాలిడ్ స్టోరీ ప్రిపేర్ చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నిజమైతే త్వరలోనే తెరపై కూడా సోనూను హీరోగా చూడబోతున్నామన్నమాట.

సోనూసూద్ ను ఇక ముందు తెరపై విలన్ గా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారా..? ఇదే ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇటీవలే ఓ మూవీ షూటింగ్ లో సోనూసూద్ కొట్టాల్సిన సన్నివేశంలో.. మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యాడట. నిజమే.. సోనూ రియల్ హీరో. తెరపై ఎలాంటి వేశాలేసినా.. ప్రస్తుతం మనందరికీ ఆయన మార్గదర్శి. ఆయన్ని తక్కువ చేసి చూపించే సన్నివేశాలు ఇక ముందు కనిపించబోవేమో. దీంతో సోనూసూద్ కూడా తాను ఇక విలన్ పాత్రలు చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తానన్న ఆయన.. నిర్మాతలను కూడా ఫైనలైజ్ చేస్తానని ప్రకటించాడు. అందులో భాగంగా.. ఒక మంచి కథను ప్రిపేర్ చేస్తున్నాడట.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్. పాన్ ఇండియా లెవెల్లో తీయబోతున్న ఈ మూవీ స్టోరీకి.. సోనూసూద్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పవన్ కల్యాణ్ తో హరి హర వీరమల్లు మూవీ చేస్తున్న క్రిష్.. ఆ తర్వాత సోనూసూద్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్తాడట. అప్పటివరకు కరోనా పరిస్థితులు చక్కబడతాయి కాబట్టి.. వీరి కలయికలో ఓ మూవీ వస్తుందని.. టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *