Categories

సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకో వద్దు!!

1 min read

Times of Nellore –కృష్ణపట్నం లో అధికారులు ఆనందయ్య నుండి సేకరించిన వివరాలు బహిర్గతమై అందరికి దొరికాయని సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకో వద్ద ని కోట సునీల్ కుమార్ స్వామి కోరారు . గూడూరులో కోట సునీల్ కుమార్ స్వామి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట సునీల్ కుమార్ స్వామి మాట్లాడుతూ వైద్యానికి సంబంధించిన ఔషదాలను అధికారులు ఆనందయ్య నుండి సేకరించిన  ప్రభుత్వానికి పంపించడం జరిగినని అన్నారు. ఆనందయ్య కరోనా నివారణకు ఉపయోగిస్తున్న ఔషధంను వాట్సాప్ గ్రూప్ లలో హల్ చల్ చేస్తుందని అన్నారు.ఔషదాలు తెలిసినంత మాత్రాన అంతా తమకే తెలిసినట్టు సొంత వైద్యం చేసుకునేందుకు మొగ్గు చూపితే ప్రాణాల మీదకు తెచుకున్నట్టే అని అన్నారు. ప్రజలు ఎవరు కూడా సొంత వైద్యం చేసుకోవద్దని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *