ఐపీఎల్ వాయిదాపై అధికారిక ప్రకటన..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో పాటు సెకెండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తుండటంతో ఐపీఎల్‌ను (IPL 2021) నిరవధికంగా వాయిదా (Suspended) వేస్తున్నట్లు బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ, బాంబే హైకోర్టుల్లో ఐపీఎల్ రద్దు చేయాలని పిటిషన్లు దాఖలు కావడంతో పాటు పలువురు క్రికెటర్లు కరోనా బారిన పడటంతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, బీసీసీఐ అధికారులు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఇందులో సభ్యులందరూ ఏకగ్రీవంగా బీసీసీఐని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ‘బీసీసీఐ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, లీగ్ కోసం పని చేస్తున్న ప్రతీ ఒక్కరి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించబోదు. ప్రతీ ఒక్కరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ విషయంపై ఐపీఎల్ భాగస్వామ్యులు, ఫ్రాంచైజీలతో కూడా మాట్లాడాము’ అని బీసీసీఐ తెలిపింది. ఇండియాలో చాలా మంది కోవిడ్ బారిన పడి బాధపడుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం కష్టకాలం నడుస్తున్నది. ఈ సమయంలో ప్రజల జీవితాల్లో కాస్త ఉపషమనం, అనుకూలతను తీసుకొని రావాలని భావించాము. కానీ, అన్నీ దగ్గర ఉండి గమనిస్తూ ఆటగాళ్లను కరోనా బారిన పడేయలేము. అందుకే టోర్నమెంట్‌ను ప్రస్తుతానికి సస్పెండ్ చేస్తున్నామని బీసీసీఐ పేర్కొన్నది. లీగ్‌లో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరు తిరిగి వారి కుటుంబాలను కలుసుకొని.. ఈ సమయంలో వారితో పాటు సంతోషంగా ఉండాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిపింది.

ఐపీఎల్‌లో పాల్గొన్న దేశ, విదేశీ ఆటగాళ్లు.. అంపైర్లు, ఇతర సిబ్బందిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తామని బీసీసీఐ హామీ ఇచ్చింది. కరోనా సమయంలో ఐపీఎల్‌కు అండగా నిలిచిన వైద్య సిబ్బందికి, రాష్ట్ర అసోసియేషన్లు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీలు, స్పాన్సర్లు, భాగస్వామ్యులు, బ్రాడ్‌కాస్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నది. ఈ కష్ట సమయంలో అందరూ బీసీసీఐకి తోడున్నందుకు కృతజ్ఞతలు తెలిపింది.

ప్రస్తుతం బయోబబుల్‌లో ఉన్న ఆటగాళ్లను అందరినీ అక్కడే కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి గమ్యస్థానాలకు విమానాలు ఏర్పాటు చేసిన వెంటనే బయోబబుల్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు తరలిస్తారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండియా నుంచి కమర్షియల్ ఫ్లైట్లను తాత్కాలికంగా నిషేధించినందు వల్ల ఆసీస్ క్రికెటర్లు, కామెంటేటర్లు ఎలా వెళ్తారనే దానిపై సందిగ్దత నెలకొన్నది. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ ప్రస్తుతం అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నది. ప్రత్యేక విమానం ద్వారా వారిని ఆస్ట్రేలియాకు అనుమతించాలని కోరనున్నాయి. దోహా లేదా అబుదాబి నుంచి ఆసీస్ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉన్నది. ఇండియన్ ప్లేయర్స్‌ను దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్టుల వరకు చేర్చే అవకాశం ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *