9 రోజుల్లో ఏడుసార్లు మోత!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఇంధన ధరలకు మళ్లీ ఆకాశానికి ఎగబాకాయి. ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పాయి. వరుసగా మూడోరోజు కూడా చమురు సంస్థలు.. పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేశాయి. ఈ నెల 4వ తేదీ నుంచి బుధవారం నాటికి ఏడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ నెల 8,9 తేదీల్లో మాత్రమే వాటి జోలికి వెళ్లలేదు. సోమవారం నుంచి మళ్లీ ఇంధన ధరల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటూ వచ్చింది. దానికి బ్రేకులు పడట్లేదు. తాజా పెంపు ప్రభావంతో అనేక పట్టణాల్లో వంద రూపాయల మార్క్‌ను దాటింది పెట్రోల్. డీజిల్ 90 రూపాయలను క్రాస్ చేసింది. ఇక్కడితో దీనికి అడ్డుకట్ట పడుతుందనే గ్యారంటీ లేదు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 22 నుంచి 25 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 24 నుంచి 27 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.91.05, డీజిల్ 82.61 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 98.36 రూపాయలు ఉంటోంది. డీజిల్‌ ధర 89.75 పైసలకు చేరింది.

చెన్నైలో పెట్రోల్ రూ. 93.84, డీజిల్‌ ధర రూ. 87.49, కోల్‌కతలో పెట్రోల్ రూ.92.16 పైసలు, డీజిల్‌ ధర రూ.85.45 పైసలు పలుకుతోంది. బెంగళూరులో పెట్రోల్-95.11, డీజిల్-87.57, హైదరాబాద్‌లో పెట్రోల్-95.67, డీజిల్ 90.06, భోపాల్‌లో లీటర్ పెట్రోల్-100.08, డీజిల్-90.95, పాట్నాలో పెట్రోల్-94.28, డీజిల్ 87.84, లక్నోలో పెట్రోల్-89.96, డీజిల్-82.99, గురుగ్రామ్‌లో పెట్రోల్-89.96, డీజిల్-83.19గా నమోదైంది.

భోపాల్‌లో వంద రూపాయల మార్క్ దాటడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలోని పర్భణీలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్క్‌ను దాటింది. అక్కడ రూ.100.73 పైసలు పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోని నగరాబంధ్‌లో లీటర్ పెట్రోల్ 103 రూపాయలను దాటింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *