Categories

జనసేన పార్టీ గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –జనసేన పార్టీ గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు మరియు హోమ్ ఐసోలేషన్ లోఉన్న పేషేంట్లకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుణకుల కిషోర్ మాట్లాడుతూ ‘మనకు కావాల్సిన వాళ్లలో చాలామంది మనల్ని విడిచి వెళ్లిపోయారు. కరోనా ఫస్ట్ వేవ్​ను విజయవంతంగా ఎదుర్కొని ఇండియా ఆత్మ విశ్వాసంతో ఉన్న సమయంలో.. ఈ తుపాను (సెకండ్ వేవ్) దేశాన్ని షేక్ చేస్తుందని అన్నారు. ప్రజలు అత్యవసరకు మాత్రమే బయటకు రావాలని కోరారు. ప్రతి ఒక్కరు మాస్కులు వేసుకొని, భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్,వినయ్ గౌడ్,చిత్తూరు బాలాజీ,కోటా బాలాజీ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *