Categories

నెల్లూరులో ఘనంగా భగీరథ జయంతి వేడుక !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతిని జిల్లాలో బుధవారం ఘనంగా నిర్వహించారు . భగీరథ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భగీరథ చిత్రపటానికి అసిస్టెంట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేసు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బి.సి. సంక్షేమ అధికారి వెంకటయ్య , బి.సి. కార్పొరేషన్ ఈ.డి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *