గూడూరులో కరోనా బాధితులకు అండగా.. !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కరోన బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏబీవీపీ, ఆశ్రయా పౌండేషన్, శ్రీ సాయి సత్సంగం నిలయం, సమరసత సేవా ఫౌండేషన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలో ఒకే ఇంటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడంతో భోజనానికి ఇబ్బందిగా ఉండటం తో వాళ్లకు నిత్యావసర సరుకులు బియ్యం కూరగాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా పాజిటివ్ తో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న వారికి మా సంస్థల ద్వారా సహాయం అందిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెటేటి చంద్రనీల్ , ఏబీవీపీ మనోజ్ కుమార్ ఏబీవీపీ నాయకులు చిన్న, కార్తీక్, ఉపేంద్ర, అక్బర్ , తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *