కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు- నెల్లూరు కలెక్టర్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –జిల్లాలోని గూడూరు పట్టణ సమీపంలో గల గాంధీనగర్ టిడ్కో గృహాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. కోవిడ్ నుండి కోలుకున్న వారు ప్లాస్మా డోనేట్ చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా పాక్షిక లాక్‌డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఉంటుందన్నారు. కోవిడ్ నియమాలను ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చక్రధర్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *