Categories

చిన్న పిల్లలచేత పనులు చేయిస్తే కఠిన చర్యలు !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –14 సంవత్సరాల లోపు చిన్న పిల్లలచేత పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని యస్. ఐ. ముత్యాల రావు హెచ్చరించారు. మంగళవారం యస్. పి ఆదేశాల మేరకు ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా హైవే పైన గల డాబాలు, హోటళ్లు మెకానిక్ షాపులు పంక్చర్ షాపులపై దాడులు నిర్వహించారు. అక్కడ పనిచేస్తున్న నలుగురు బాల కార్మికులను గుర్తించారు. వారి అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రులను పిలిపించి అవగాహన కల్పించి అప్పగించారు. ఆయన మాట్లాడుతూ 14 ఏళ్ళలోపు చిన్న పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలని సూచించారు. ఇలా దుకాణాల్లో పనిచేయించుకొంటే వారి మీద కూడా బాల కార్మిక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని.
హెచ్చరించారు. ఎక్కడైన బాలకార్మికుల చేత పనులు చేయిస్తుంటే తమ కి సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ఎఎస్. ఐ డేవిడ్ దాస్ కానిస్టేబుళ్ళు శంకర్, రమేష్, వెంకటేష్ తదితరులు పాల్గొనినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *