అస్వస్థతతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరిన నటుడు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –సీనియర్ నటుడు, దేశీయ మురుపొక్కు ద్రవిడ కళగం వ్యవస్థాపకుడు విజయకాంత్ అస్వస్థతో చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. శ్వాస సరిగా ఆడడం లేదని చెప్పడంతో ఈ తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు ఆయన కుటుంబ సభ్యులు.. కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంన్నారు. ప్రస్తుతం ఆయన హెల్త్ గురించి చెప్పలేమని, అన్ని పరీక్షలు చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులో విజయకాంత్ కరోనా వైరస్ పాజిటివ్ కి గురి కావడంతో ఆసుపత్రిలో చేరారు.చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *