Categories

రేపటి నుంచి కృష్ణపట్నంలో కరోనాకు మందు పంపిణీ-ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి స్పష్టం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం కరోనా మందు పంపిణీ విషయంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టతనిచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కృష్ణపట్నంలో  ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న మందును, రేపటి నుండి 21-05-2021, శుక్రవారం నుండి పంపిణీ చేస్తున్నాం.ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదు. కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది.ఈ మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించాం. రేపటి నుండి అనగా తేది:21-05- 2021, శుక్రవారం ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *