మహిళలు ముందుకు వచ్చి కరోనా విపత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టాలి-రాజేశ్వరి!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లా మహిళా మోర్చావిభాగం వారు కరోనా విపత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులోభాగంగా ఇరుకళల పరమేశ్వరి గుడి దగ్గర వున్న రాజీవ్ గృహకల్ప కాలనీలో బాల,బాలికలకు మరియు పెద్దలకు మాస్కులు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసారు . ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు రాజేశ్వరి కండికట్ల మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరియు మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ అధ్యక్షతన మహిళా మోర్చా ఆధ్వర్యంలో కరోనా సేవా సప్తాహంలో భాగంగా కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు .మున్ముందు కూడా సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి కరోనా విపత్తులో సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *