ఏపీలో కొత్తగా 20,034 కరోనా కేసులు, 82 మంది మృతి!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పాసిటీవ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి రోజూ ఏపీలో 15 వేలకు పైగానే కరోనా పాసిటీవ్ కేసులు నమోదవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 20,034 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 12,207 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. కరోనా కారణంగా 82 మంది మృతిచెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో ప్రభుత్వం 1,15,784 కరోనా పరీక్షలు చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు విధిగా వాడాలని వైద్యులు సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండోద్దని వైద్యులు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *