జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అడ్డుకాలు పడింది. గురువారం బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ నీలం సాహ్ని మధ్యలో నిలిచిపోయిన ఎన్నికలను వీలైనంత త్వరగా జరపాలని భావించారు. ఇందులో భాగంగానే కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 8న ఎన్నికల పోలింగ్ నిర్వహించి ఈనెల10న ఫలితాలను ప్రకటించాలని నిర్ణియించింది.

ఈ నేపథ్యంలో బాధ్యతలు చేపట్టిన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సహానీ కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే అధికార వైసీపీ మినహా మరే పార్టీ కూడా ఇందుకు ఒప్పుకోవడం లేదు. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ, జనసేన – బీజేపీ ఇలాంటి కీలక పార్టీలు సైతం గైర్హాజరయ్యాయి.

అయితే మరోపక్క జనసేన దాఖలు చేసిన పిటిషన్ ఒకటి హైకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీనిపై మూడో తారీఖున విచారణ జరగాల్సి ఉంది అయినా సరే కొత్త ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్లీ ముగ్గురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఎన్నికల కమిషనర్ జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ సవాల్ చేస్తూ వీరు ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరగా ఆ మూడు పిటిషన్లను ఈరోజు హైకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిషత్ ఎన్నికలపై తమ అభిప్రాయాలను నేతలు తెలియజేశారు. ఎన్నికలను బహిష్కరించాలని మెజార్టీ నేతలు సూచించారు. అభ్యర్థులు కూడా పోటీ నుంచి వెనక్కి వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని.. ఎన్నికల బహిష్కరణపై క్యాడర్‌కు, అభ్యర్థులకు వివరించాలని నేతలు అభిప్రాయం పడ్డారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం కీలక ప్రకటన చేసే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *