వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి ఎంపీ బైపోల్‌ ప్రచార పర్యటన రద్దు..!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –సీఎం జగన్మోహన్‌ రెడ్డి తిరుపతి ప్రచార పర్యటన రద్దైంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తన పర్యటన రద్దు చేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఈ మేరకు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు మీ జగన్‌ రాస్తున్న లేఖంటూ ప్రారంభించిన ముఖ్యమంత్రి… తిరుపతి పార్లమెంట్‌ బై పోల్‌ లో మనందరి అభ్యర్థిగా పోటీ చేస్తోన్న గురుమూర్తికి ఓటు వేయాల్సిందిగా నేను రాసిన ఉత్తరం మీ ఇంటికి అందిందని భావిస్తున్నాను.. అంటూ తన పర్యటన రద్దు కావడానికి గల కారణాలను కూడా జగన్‌ తన లేఖలో తిరుపతి ఓటర్లకు వివరించారు.

కాగా, ఈనెల 8వ తేదీ గురువారం తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల ఇంటింటికీ సీఎం జగన్ లేఖలు పంపిన సంగతి తెలిసిందే. ఎంపీ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుకున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి ఈ లేఖలు పంపారు. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా జరిగిన లబ్ధిని లేఖలో వివరించారు. రాష్ట్రాభివృద్ధి, వాగ్దానాల అమలు, ప్రభుత్వ దార్శనికతను సీఎం ఆ లేఖలో ప్రస్తావించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గంలోని కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా లేఖలు రాశారు. అయితే, ఇప్పుడు పర్యటన రద్దు అవుతున్నట్టు తాజాగా మరో లేఖ రాశారు జగన్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *