ఇంద్రకీలాద్రిపై అవినీతి ప్రక్షాళనకు సర్కార్ ఫోకస్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ఇంద్రకీలాద్రిలో ప్రక్షాళణ మొదలైందా? ఈవో సురేష్ బాబు బదిలీ. గతంలో 15 మంది ఉద్యోగుల సస్పెన్షన్..తాజాగా ఇద్దరు ఏఈవో ల బదిలీ… ఇంక నెక్ట్స్ ఎవరు..? ఎసిబి, విజిలెన్స్ అధికారులు సర్కార్ కు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తర్వాత ఎవరిపై వేటు పడనుంది? వాచ్ దిస్ స్టోరీ

దుర్గగుడి పై సర్కార్ స్పెషల్ ఫోకస్ చేసింది. వరుస వివాదాలకు చెక్ పెడుతూ ఇంద్రకీలాద్రి పై అవినీతి లేకుండా చేయాలని ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అవినీతి అక్రమాల కు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేయడం వీరందరికీ బాధ్యుడైన ఈవో ను కమిషనర్ కార్యాలయంకు సరెండర్ చేయడంతో అధికారుల్లో భయం పట్టుకుంది.

ఇదిలా ఉంటే దేవాదాయశాఖ లో స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరుగాంచిన రాజమండ్రి ఆర్‌జేసీ బ్రమరంబను దుర్గగుడి ఈవోగా నియమించింది సర్కార్. ఆమె రాష్ట్రంలోని తిరుమల, దుర్గగుడి తప్ప అన్ని ప్రధాన ఆలయాలలో ఈవోగా పనిచేశారు. ఐతే, గతంలో జరిగిన వివాదాల జోలికి పోనని, అక్రమాలను అరికట్టి ఆదాయం పెంచడమే తన లక్ష్యమని ఆమె అంటున్నారు.

నిత్యం అవినీతి, వివాదాలతో హోరెత్తిపోతున్న ఇంద్రకీలాద్రిపై భక్తులు అసహానంగా ఉన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈవో బ్రమరంబ, దేవాదాయశాఖ, ప్రభుత్వం దుర్గగుడిపై ఫోకస్ పెట్టి అక్రమాలను నిర్మూలిస్తారని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *