కోవిడ్ సేవలపై ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షా సమావేశం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నారాయణ హాస్పిటల్ లో కరోనా పై నోడల్ అధికారితో మరియు డాక్టర్ లతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా కూడా రెమిడీసీవర్ ఇంజక్షన్, ఆక్సిజన్ మరియు బెడ్ల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ కరోనా పై ప్రతి జిల్లా స్థాయి అధికారులతో ప్రతిరోజూ సమన్వయం చేసుకుంటూ, ప్రత్యేక అధికారులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రజలుకూడా కనీసపాటి భౌతిక దూరం పాటిస్తూ మరియు మాస్కులు ధరించి ఎవరికి వారు రక్షణ పొందాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *