రేషన్‌ పంపిణీ పూర్తయ్యే వరకూ గ్రామ, వార్డు వాలంటీర్లు వాహనం వెంటే….!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –రేషన్‌ పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్డు, గ్రామ వాలంటీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రామ, పట్టణ వార్డుల్లో రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వాలంటీర్లు రేషన్ పంపిణీ వాహనం వెంటే ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ఇంటింటికీ రేషన్‌ పంపిణీ సమయంలో మొబైల్‌ వాహనంలోని ఈ-పోస్‌ యంత్రాన్ని నిర్వహించాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని పేర్కొంది. కార్డుదారుల నుంచి వేలిముద్రలను వాలంటీర్లే తీసుకోవాలి.. తమ క్లస్టర్‌ పరిధిలో నిత్యావసరాల పంపిణీ పూర్తయ్యే వరకు వాహనం వద్దే అందుబాటులో ఉండాలని పేర్కొంది.

ఈ మేరకు వాలంటీర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ డైరెక్టర్‌ నారాయణ్‌ భరత్‌ గుప్తా పలు సూచనలు చేశారు. అయితే, రేషన్ సరుకుల లోడింగ్‌, అన్‌లోడింగ్‌, మోసుకెళ్లడం తదితర పనులేవీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మొబైల్‌ వాహనాల ద్వారా నిత్యావసరాల పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా.. పురపాలక కమిషనర్లు, ఎంపీడీవోలకు సూచనలు చేయాలని జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లను గుప్తా కోరారు. ఇక, రేషన్ సరుకుల పంపిణీ విషయంలో వాలంటీర్ల మరిన్ని బాధ్యతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *