రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుంది- భాను ప్రకాష్ రెడ్డి !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందని, తిరుమల పవిత్రతను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని జేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది భక్తుల ఆరాధ్యదైవం వెంకటేశ్వర స్వామి, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సమర్ధించడం అసమంజసమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి గారు మరియు ముఖ్యఅతిథిగా అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనురాధ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్, గిరి గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *