రికార్డులు బ్రేక్ చేస్తున్న పుష్ప టీజర్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప. మైత్రి మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్‌ 7న పుష్పరాజ్‌ కేరెక్టర్ ను పరిచయం చేస్తూ మూవీ టీం టీజర్‌ విడుదల చేసింది. విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఇక ఇప్పటివరకు యూట్యూబ్‌లో 30 మిలియన్‌ వ్యూస్‌ని దాటేసింది. అంతేకాదు, మిలియన్‌ లైక్స్‌కు చేరువైంది. ముఖ్యంగా లైక్స్‌ విషయంలో బాహుబలి, రాధేశ్యామ్‌ మూవీల రికార్డును పుష్ప అధిగమించింది. తగ్గేదే..లే అని బన్నీ చెప్పిన డైలాగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నారు. ఇందులో విలన్ గా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్ నటిస్తున్నాడు. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, సునీల్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *