పేరు మార్చుకొని ప్రచారం చేస్తున్నారు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంట పాలెం లో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ రైతు కష్టాలు తీర్చేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కిసాన్ నిది యోజన పథకాన్ని ప్రారంభించారు. కష్టాలలో ఉన్న రైతులకు ఊరట కల్పించేందుకు పెట్టిన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరు మార్చుకుని ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లు పాలనలో ఈ రాష్ట్రంలో వెనుకబాటుతనం, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగులు ఉద్యోగా అవకాశాలు లేక వలసలు వెళ్లడం ఈ రాజకీయ పార్టీలు పాలించడం వల్లనే జరిగాయని అన్నారు. గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం వైఫల్యాలను ఓటర్లకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి ఎంపి అభ్యర్థిగా రత్నప్రభ కి ఓటు వేసి గెలిపించాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *