పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం- టోనీ బాబు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ జన్మదిన వేడుకలో నెల్లూరులో ఘనంగా జరుగుతాయని జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు టోనీ బాబు తెలిపారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 8న అకీరా నందన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *