10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చెయ్యాలి- ఏబీవీపీ నాయకులు !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –ప్రస్తుత సమాజంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఏర్పడ్డాయి కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తూ సమాజంలో అనేక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తుందని,రానున్న 30రోజుల్లో కరోనా దాని యొక్క విశ్వరూపం చూపిస్తుందని వైద్య నిపుణులు భావిస్తున్నారని ఏబీవీపీ నాయకులు అన్నారు. గూడూరు ప్రెస్ క్లబ్ లో వారు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 0వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసి కరోనా బారి నుండి విద్యార్థులను కాపాడాలని కోరారు. అనేక విద్యాసంస్థలు కరోనా కారణంగా ముందస్తుగానే మూసివేసిన కారణంగా విద్యార్థులకు అందవలసిన విద్యాబోధన పూర్తి స్థాయిలో అందించలేకపోయారు. మరియు రాష్ట్రంలో లక్షల మంది తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల ఆరోగ్య విషయంపై తీవ్ర ఆందోళనలో సతమతమవుతున్నారు. కావున ఈ తరుణంలో మీరు పరీక్షలు నిర్వహించదలిస్తే తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు విద్యార్థులు యొక్క శారీరక,మానసిక శక్తిని అంచనా వేసుకుని వారి యొక్క పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుకుంటున్నామన్నారు.పరీక్షలు నిర్వహించదలిస్తే తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు విద్యార్థులు యొక్క శారీరక,మానసిక శక్తిని అంచనా వేసుకుని వారి యొక్క పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని కోరుకుంటుంది… విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి ప్రాణాలకు ముప్పు రాకుండా ఉండాలంటే పరీక్షగా తాత్కాలికంగా వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కార్తీక్ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న ఏబీవీపీ నగర కార్యదర్శి కార్తీక్ ఏబీవీపీ కార్యకర్తలు సుబ్రహ్మణ్యం ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *