నాగ్ ఓటీటీ సినిమాకు అనూహ్య ఆదరణ!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్‌’ సినిమాతో ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తీవ్రవాద ఆపరేషన్ నేపథ్యంలో వైల్డ్ డాగ్‌ సినిమాను కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమెన్ తెరకెక్కించాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నటికి.. కమర్షియల్ గా మాత్రం వసూళ్లను రాబట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన 19 రోజుల్లోనే ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. కాగా ఈ సినిమాకు అనూహ్య స్పందన వస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన నేషనల్‌, ఇంటర్నేషనల్ సినిమాలను కూడా వైల్డ్ డాగ్ బీట్ చేస్తుంది. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. థియేటర్స్ లో మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకెళ్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *