మీ అంతట మీరు రెమ్‌డెసివిర్ తీసుకోవద్దు-ఎయిమ్స్ చీఫ్!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –కరోనాకు ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు యాంటీవైరల్ ఇంజక్షన్ రెమ్‌డెసివిర్‌ను తీసుకోవద్దని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా సూచించారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెమ్‌డెసివిర్‌ను తీవ్రంగా ఉన్న కేసుల్లో మాత్రమే ఇస్తామని, కాబట్టి ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకుంటున్న వారు దానిని తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రెమ్‌డెసివిర్‌ను వైద్య నిపుణుడి సమక్షంలో ఆసుపత్రిలో మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు దాని నుంచి ఎప్పుడు బయటకు రావాలన్న ప్రశ్నకు డాక్టర్ గులేరియా స్పందిస్తూ.. లక్షణాలు లేకుండా కనీసం పది రోజులు గడిచిన తర్వాత, మూడు రోజులపాటు ఎలాంటి జ్వరం లేకుంటేనే హోం ఐసోలేషన్‌ను విడిచిపెట్టాలన్నారు. హోం ఐసోలేషన్ గడువు ముగిసిన తర్వాత మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. డాక్టర్ సలహా మేరకే సిస్టమాటిక్ స్టెరాయిడ్స్‌ను వేసుకోవాలని డాక్టర్ గులేరియా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *