3.23లక్షల కొత్త కేసులు..2,771 మరణాలు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –భారత్‌లో ప్రతిరోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండడం కలకలం రేపుతోంది. నిన్న కొత్తగా 3లక్షల, 23వేల, 144 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నిన్న 2లక్షల, 51వేల, 827 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1కోటి, 76లక్షల, 36వేల,307 కు చేరింది.

గడిచిన 24 గంటల సమయంలో 2వేల,771 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1కోటి, 97లక్షల, 894కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1కోటి, 45లక్షల, 56వేల, 209 మంది కోలుకున్నారు. 28లక్షల, 82వేల, 204 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 14కోట్ల ,52లక్షల, 71వేల,186 మందికి వ్యాక్సిన్లు వేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *