మరణాలు లెక్క తప్పుతున్నాయి.. శ్మశానాల్లో రద్దీ ఏంటి?

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే, ప్రభుత్వ గణాంకాల్లో నమోదవుతున్న లెక్కలకన్నా మరణాల సంఖ్య అధికంగా ఉంటుందని ప్రముఖ వైరస్‌ శాస్త్రజ్ఞుడు, శాంతిభట్నాగర్‌ అవార్డు గ్రహీత, డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ పేర్కొన్నారు. భారత్‌లో మరణాలను సరిగా లెక్కించడం లేదని అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలు నిజమైతే దేశంలోని శ్మశానాల్లో ఇంతలా రద్దీ ఉండకూడదు అని జమీల్‌ తెలిపాడు. అయితే ఈ మరణ గణాంకాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారని తాను భావించడం లేదని తెలిపాడు. సరిగా పరీక్షలు నిర్వహించకపోతే కేసుల సంఖ్య కూడా కచ్చితంగా తెలియదని జమీల్‌ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *