అభిమానులకు మహేష్‌ బాబు రిక్వెస్ట్!!‌

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ – దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ప్లాస్మా దానం చేయాలంటూ తన అభిమానులకు రిక్వెస్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసి సజ్జనార్‌ తన ట్విట్టర్‌ పేజీలో కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను డోనేట్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ వీడియోను రీట్వీట్‌ చేశారు. సీపీ సజ్జనార్‌ ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. మహేష్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ప్లాస్మా డోనేట్‌ చేయాలంటూ.. అభిమానులకు పిలుపినిచ్చారు. కరోనాతో పోరాడుతున్నవారికి మన నుంచి సహయం చేద్దాం. గతంలో కంటే.. ప్రస్తుతం ప్లాస్మా డోనేటర్స్‌ అవసరం ఉన్నారు అంటూ ట్వీట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *