లవ్‌ ఫెయిల్యుర్‌ను భరించడం కష్టం-అంజలి!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –‘ప్రేమ లేఖ రాశా’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది తెలుగమ్మాయి అంజలి. ఇక అనంతరం పలు తమిళ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. షాపింగ్‌ మాల్‌ చిత్రంలో తన అద్భుత నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందమైన రూపం, సహజ నటనతో మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది.
ఇక కెరీర్‌లో దూసుకెళుతోన్న సమయంలోనే అంజలి ప్రేమాయణంలో మునిగి తేలుతోందన్న వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ నటుడితో అంజలి ప్రేమలో ఉందని, త్వరలోనే వివాహం కూడా చేసుకోనున్నారనే వార్త అప్పట్లో తెగ వైరల్‌ అయ్యింది. అయితే తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ.. అంజలి ప్రేమ కథకు ముగింపు పడింది. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత అంజలి తన ప్రేమ, బ్రేకప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంజలి ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ప్రమోషన్లలో పాల్గొన్న అంజలి పలు వ్యాఖ్యలు చేసింది. తాను ప్రేమలో పడడం నిజమేనని చెప్పిన ఈ అందాల తార.. ‘నేను హీరోయిన్‌ అయినంత మాత్రాన నా మనసు బండరాయి కాదు. ప్రేమ విఫలమైన బాధను భరించడం చాలా కష్టం. అలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడ్డానంటే దానికి కారణం మా అమ్మే. ఎన్నో కష్టాలను భరించిన అమ్మనే ఆదర్శంగా తీసుకొనే లవ్‌ బ్రేకప్‌ను అధిగమించాను’ అని తన మనసులో మాటను చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే అంజలి చివరిగా నిశ్శబ్ధం చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం వకీల్‌సాబ్‌తో పాటు ‘ఆనంద భైరవి’ సినిమాలోనూ నటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *