సేవకు మారుపేరు కోటా సునీల్ కుమార్ స్వామి !!

1 min read

Times of Nellore –కరోనా ప్రభావంతో అందరు ఇబ్బందులు పడుతున్న సమయంలో గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో రోగులు అధికంగా ఉండటం అదే పరిస్థితుల్లో వైద్యశాలలో సదుపాయాలు లేక ఫ్యాన్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని తెలుసుకున్న కోటా సునీల్ కుమార్ సాయి సత్సంగం నిలయం, సమరసత సేవా ఫౌండేషన్, ఆశ్రయ ఫౌండేషన్, ఏబీవీపీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సేవాభారతి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ చేతుల మీదగా ప్రభుత్వ వైద్యశాలకు 15 ఫ్యాన్ లు అందించారు. అనంతరం గూడూరు కోవిడ్ సెంటర్ వద్ద అధికారులకు భోజనం సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో సేవా దృక్పథం తో ముందుకు వచ్చిన కోట సునీల్ కుమార్ సేవలు అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పేటే టి చంద్రనీల్ ఏబీవీపీ మనోజ్ కుమార్ ,కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *