భారత్‌కు చేరిన 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్ కొనసాగుతన్న తరుణంలో ప్రపంచ దేశాలు ఇండియాకు బాసటగా నిలుస్తున్నాయి. మహమ్మారిపై పోరుకు అవసరమైన సహాయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హాంగ్ కాంగ్ భారత్‌కు అండగా నిలిచింది. దాదాపు 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకు తరలించింది. హాంగ్ కాంగ్ పంపించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్రత్యేక విమానంలో ఇండియాకు చేరాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతోపాటు ఇతర వైద్య పరికరాలు హాంగ్ కాంగ్ నుంచి భారత్ చేరినట్టు పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. కష్టకాలంలో భారత్‌కు సహాయం చేసేందుకు 40కిపైగా దేశాలు భారత్‌కు ముందుకు వచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్లు, ఔషధాలు, వెంటిలేటర్లు, ఇతర సామాగ్రి పంపిందేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయని పేర్కొన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *