కరోనా కేసులు.. బ్రెజిల్‌ను దాటేసిన భారత్!!!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొదటి దశను మించి విజృంభిస్తోంది. నిత్యం లక్షకు పైగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో 1,68,912 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,35,27,717కి చేరింది. ఫలితంగా కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్న దేశాల జాబితాలో బ్రెజిల్‌ను దాటేసి అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలిచింది.

అమెరికాలో ఇప్పటి వరకు 3,19,18,591 కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో మొత్తం ఇప్పటివరకు 1,34,82,543 కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా బ్రెజిల్ కేసుల సంఖ్యను భారత్ దాటేసింది. కేసుల సంఖ్య పరంగా భారత్ రెండో స్థానంలో ఉండగా.. మృతుల సంఖ్య (1.70 లక్షలు) విషయంలో మాత్రం నాలుగో స్థానంలో ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *