వీధి కుక్కలకి ప్రచార పోస్టులు !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –రాజకీయ నాయకులు గెలుపు కోసం ఎలాంటి హామీలైనా ఇస్తారని తెలుసు. కానీ, ఇప్పుడు ప్రచారానికి దేన్నైనా వాడేస్తారని నిరూపించారు ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాజకీయనేతలు. వారు తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు మూగజీవాలను కూడా వాడేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రాయ్ బరేలీ, బాలియా నియోజకవర్గాల అభ్యర్థులు వింత పోకడలకి పోయారు. అక్కడి వీధి కుక్కలకి తమ ప్రచార పోస్టర్లు అంటించారు. తమకే ఓటు వెయ్యాలని ఆ పోస్టర్లపై కోరారు. ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు వారిపై ఫైర్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *