దళపతి విజయ్‏తో ఉన్న ఈ హీరోయిన్‏ను గుర్తు పట్టారా ?

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతికి చెందిన ఓ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు.. ఏ సినిమాలో వీరిద్దరు కలిసి చేసారు. అసలు వీరిద్దరు ఎప్పుడు ఫోటో దిగారు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పక్కన ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగు తమిళంలో సినిమాల్లో హీరోయిన్‏గా నటిస్తూ ఫుల్ బిజీ అయ్యింది.

ఇదిలా ఉంటే నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఉన్నది అందాల భామ నివేదా థామస్. 2008లో విడుదలైన కురువి అనే తమిళ సినిమాలోనిది ఆ ఫోటో. తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మాతగా రెడ్ జెయింట్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన ఫస్ట్ సినిమా ఇది. అయితే ఈ ఫోటో వెనక చాలా పెద్ద స్టోరీ ఉందట. తమిళంలో విజయ్, త్రిష జంటగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన సినిమా ‘గిల్లి’. ఆ సినిమా చూసి ఫ్యాన్ గా మారిపోయిన ఉదయనిధి.. మళ్లీ అదే పెయిర్ అదే డైరెక్టర్ తో సినిమా తీయాలనీ భావించి ‘కురివి’ సినిమా నిర్మించాడు. ఇక ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ సాధించింది. ఇందులో నివేదా విజయ్ చెల్లిగా నటించింది. అప్పుడు తన వయసు కేవలం పన్నెండు సంవత్సరాలు. నిజానికి బాలనటిగా ఉన్న నివేదా చాలా సినిమాల్లో నటించింది. ఈ సినిమా తెలుగులో దోపిడి పేరుతో నివేదా డబ్ వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ 2014లో విజయ్ సినిమా జిల్లాలో నటించింది. నివేదా చివరిగా నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమాలో కనిపించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోనూ నివేదా థామస్ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 9న విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *