కోవిడ్ సేవలపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సమీక్షా సమావేశం !!

1 min read

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ –నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని తిక్కన భవన్ నందు శుక్రవారం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు జాయింట్ కలెక్టర్లు, కోవిడ్ నోడల్ అధికారులతో కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షా, సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో నోడల్ అధికారులు చికిత్స పొందుతున్న వారి కేస్ షీట్స్ పరిశీలిస్తూ.., మెరుగైన వైద్య అందేలా వైద్యులతో కో-ఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయాలని.., ప్రతిరోజూ ఆస్పత్రిలో ఎంతమంది పేషంట్స్ అడ్మిట్ అయ్యారు..? ఎంతమంది డిశ్చార్జ్ అయ్యారు..? అనే రిపోర్టు అందించాలన్నారు. జి.జి.హెచ్. , నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నవారు, చికిత్స తీసుకున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.., తీవ్రమైన వ్యాధి లక్షణాలు లేని వారిని గుర్తించి కోవిడ్ కేర్ సెంటర్ కి తరలించాలన్నారు. కేసుల తీవ్రత జిల్లాలో ఎక్కువగా ఉన్నందున ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోంది అని.., బెడ్స్ లభించడం లేదని.. రెమిడిస్ వేర్ వంటి ఇంజక్షన్స్ లభించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని.., వీటిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి.., తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఉన్నవారికి బెడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. పి.హెచ్.సి, సి.హెచ్.సి లలో కూడా ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయాలని, అవసరమైన వారికి అక్కడే చికిత్స అందించాలన్నారు. నోటిఫైడ్ ఆస్పత్రుల్లో ఐ.సి.యూ, ఆక్సిజన్, సాధారణ బెడ్స్ ఎన్ని అందుబాటులో ఉన్నాయనే వివరాలు.., ఎప్పటికప్పుడు 104 కాల్ సెంటర్ కి అందించాలన్నారు. 104 కాల్ సెంటర్ ద్వారా ఆస్పత్రులో చేరడానికి సంప్రదించిన వారిని, ముందుగా ఆస్పత్రికి చేరగానే ట్రయాజనింగ్ నిర్వహించి, మైల్డ్ లక్షణాలు ఉంటే వారిని కోవిడ్ కేర్ సెంటర్ కి తరలించాలన్నారు. 60 ఏళ్లు దాటిన వారు, హోం ఆర్బిటీస్ ఉన్నవారికి ఆస్పత్రుల్లో చికిత్స అందించడంలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇంట్లో ప్రత్యేకంగా రూం, బాత్రూం సదుపాయం ఉన్నవారికి మాత్రమే హోం ఐసోలేషన్ కేటాయించాలని, ఇంట్లో సదుపాయం లేనివారిని తప్పని సరిగా కోవిడ్ కేర్ సెంటర్ కి తరలించాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఎక్స్ రే మిషన్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, హెమటాలజీ మిషన్స్, ఇతర వైద్య పరికరాలను అందుబాటులో తీసుకువచ్చామని, ఎక్కడైనా అవసరమైతే వాటిని వెంటనే కొనుగోలు చేసి.., కోవిడ్ కేర్ సెంటర్లలో మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెమిడిస్ వేర్ ఇంజక్షన్స్ పేషెంట్స్ కి మాత్రమే అందేలా చూడాలని, ఏ పేషంట్ కి రెమిడిస్ వేర్ ఇంజక్షన్ ఇచ్చారు..? అతను ఎప్పుడు పాజిటివ్ అయ్యారు..? ఆధార్ కార్డు వివరాలు.., ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు..? అనే వివరాలు ప్రతి కేస్ వైజ్ రిపోర్టు తయారుచేయాలన్నారు. హోం ఐసోలేషన్ ఉన్నవారు రెమిడిస్ వేర్ ఇంజక్షన్ వినియోగించాల్సిన అవసరం లేదని, నిపుణులైన వైద్యులు సూచించినప్పుడు మాత్రమే.., దానిని వినియోగించాలనే అవగాహన ప్రజలకు కల్పించాలన్నారు. మొదటి ఫేజ్ లో కోవిడ్ బారిన పడిన వారికి జిల్లాలో అత్యుత్తమైన సేవలు అందించామని.., అదే నిబద్ధతతో అధికారులు అందరూ పనిచేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సాధారణంగా వైద్యులకు మాత్రమే ప్రాణాన్ని కాపాడే అవకాశం లభిస్తోందని అని.., ఇప్పుడు మాత్రం కోవిడ్ టాస్క్ ఫోర్సులోని అధికారులు అందరికీ ప్రజల ప్రాణాలను రక్షించే అవకాశం లభించిందని.., జీవితంలో ఈ అదృష్టం అందరికీ లభించదని కలెక్టర్ తెలిపారు. రెండో ఫేజ్ లో కోవిడ్ భారిన పడిన వారిలో ఎక్కువ మందికి శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతున్నాయని.., అందువల్ల ఆక్సిజన్ బెడ్స్ ని అవసరమైన వారికి మాత్రమే కేటాయించేలా నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కూడా వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎప్పటి కప్పుడు నిపుణులైన సిబ్బంది చేత ఆక్సిజన్ సరఫరాని గమనిస్తూ ఉండాలని ఆదేశించారు. జి.జి.హెచ్. ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం, పౌష్టికాహారంతో కూడిన భోజనం, మెడిసిన్స్ అందించడంలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలన్నారు. వైద్యులు వార్డులలో పర్యటించి పేషంట్స్ తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పాలన్నారు. వారికి అందిస్తున్న వైద్యం, దానివలన వారికి కలిగే ప్రయోజనాన్ని వైద్యులు పేషంట్స్ కి వివరిస్తే.., వారిలో ధైర్యం కలిగి త్వరగా కోలుకుంటారన్నారు. నోటిఫైడ్ కోవిడ్ ఆస్పత్రుల్లోని సి.సి కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం తప్పక చేయాలన్నారు. జి.జి.హెచ్ ఆస్పత్రిలో ప్రతి వార్డులోనూ స్పీకర్లు ఏర్పాటు చేసి, చికిత్స తీసుకుంటన్న పేషంట్స్ కి అందిస్తున్న వైద్య సేవల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఐ.సి.యూ వార్డులో చికిత్స తీసుకుటున్న వారి ఆరోగ్య సమాచారం బంధువులకు అందించే ఏర్పాటు చేయాలని, దీనివలన పేషంట్స్ కుటుంబ సభ్యులకు కూడా తమ వారికి ఆస్పత్రిలో మెరుగైన వైద్య లభిస్తోందనే భరోసా కలుగుతోందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ( అభివృద్ధి) డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) హరేంధిర ప్రసాద్, డి.ఎఫ్.ఓ షణ్ముఖ్ కుమార్, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, వైద్యులు, సిబ్బంది హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *